ఎపిక్ (Epic)

YouTuber Nandana : సోషల్ మీడియా, యూట్యూబ్ తో ఫేమ్ తెచ్చుకున్న నందూస్ వరల్డ్ నందన, మధుకర్ ఇటీవల లండన్ లో ఉద్యోగాలు, వీసాలు ఇప్పిస్తామని పలువురు విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేసారని మోసపోయిన బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు నందన, మధుకర్ పై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఇన్నాళ్లు లండన్ లోనే ఉన్న నందన నిన్న హైదరాబాద్ కి రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకొని ఇబ్రహీంపట్నంకు తరలించారు.

తాజాగా నందన బిగ్ బాస్ లోకి వెళ్ళడానికే ఇండియా వచ్చిందని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా నందూస్ వరల్డ్ కపుల్ ఇద్దరూ బిగ్ బాస్ లోకి వెళ్తారని, నందన బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందని వార్తలు వచ్చాయి. నందుకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తాజాగా మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోకి ఎంట్రీకి అవకాశం వచ్చిందట. అయితే ఈ కేసు ఉండటంతో అది క్లియర్ చేసుకొని వస్తేనే హౌస్ లోకి పంపిస్తామని నిర్వాహకులు చెప్పినట్టు టాక్ నడుస్తుంది.

Also Read : Vaishnavi Chaitanya : తన కోసం తాను నిలబడే అమ్మాయి.. ‘ఎపిక్’పై వైష్ణవి చైతన్య..

అందుకే నందు ఇండియాకు వచ్చిందని, అయితే లుక్ అవుట్ నోటీసులు ఉండటంతో రాగానే ఆమెని అరెస్ట్ చేసారని సమాచారం. నందు ఈ లీగల్ అడ్డంకులు అన్ని తొలగించుకొని, ఆ కేసు క్లియర్ చేసుకొని వస్తే బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని బిగ్ బాస్ అంతర్గత సమాచారం. మరి నందు కేసు క్లియర్ అవుతుందా? ఆమె బిగ్ బాస్ కి వెళ్తుందా? నిజంగానే ఆమె బిగ్ బాస్ కోసమే ఇండియాకు వచ్చిందా తెలియాలంటే ఎదురు చూడాల్సిందే.
తాజాగా నందన బిగ్ బాస్ లోకి వెళ్ళడానికే ఇండియా వచ్చిందని వార్తలు వస్తున్నాయి. (YouTuber Nandana)