
బిర్యానీకి లవర్స్ ఎక్కువ. ప్రతిరోజూ బిర్యానీ తినేవారు కూడా ఎక్కువే. అందుకే బిర్యానీ బిజినెస్ బాగా నడుస్తుంది. దీనికి పెట్టే పెట్టుబడి కూడా తక్కువే. అందుకే చిన్నగా ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. రోడ్డు పక్కన చిన్న బండిపై కూడా బిర్యానీ బిజినెస్ మొదలుపెట్టవచ్చు. ఒక ప్లేట్ బిర్యానీ రూ.90 ధర నిర్ణయించి.. రోజూ 50 ప్లేట్లు అమ్మితే నెలకు రూ.1.35 లక్షల ఆదాయం వస్తుంది. సరుకులు, అద్దె, సిబ్బంది జీతాలు, గ్యాస్, ఇతర ఖర్చులు తీసేస్తేనే అసలు లాభం తెలుస్తుంది. ఏ వ్యాపారంలోనైనా అమ్మకాలు మాత్రమే సరిపోవు. ఫుడ్ క్వాలిటీ, ధర, లొకేషన్, కస్టమర్లు, సరుకుల ఖర్చు, రోజువారీ నిర్వహణ వంటివి లాభాన్ని నిర్ణయించే కీలకమైన అంశాలు. ఉదాహరణకు, ఒక ప్లేట్ బిర్యానీని రూ.90కి అమ్ముతున్నారని అనుకుందాం. రోజూ 50 ప్లేట్లు అమ్మితే, ఒక రోజు మొత్తం అమ్మకం రూ.4,500 అవుతుంది. బిర్యానీ బిజినెస్ 30 రోజుల పాటూ అమ్మకాలు జరిగితే, నెల మొత్తం ఆదాయం రూ.1.35 లక్షలు అవుతుంది. కానీ ఈ రూ.1.35 లక్షలు మొత్తం లాభం అనుకుంటే పొరపాటే. అసలు లాభం తెలియాలంటే అన్ని ఖర్చులనూ తీసేయాలి. బిర్యానీ తయారీకి అవసరమైన బియ్యం, మాంసం, నూనె, మసాలాలు, కూరగాయల వంటి సరుకులకు నిరంతరం ఖర్చు అవుతుంది. వీటితో పాటు షాప్ లేదా కిచెన్ అద్దె, సిబ్బంది జీతాలు, కరెంట్, గ్యాస్, నీళ్లు, ప్యాకింగ్, రవాణా ఖర్చులు కూడా ఉంటాయి. ఇలాంటి ఖర్చులన్నీ కలిపి నెలకు సుమారు రూ.80,000 వరకు కావచ్చని అంచనా. ఆ స్థాయిలో ఖర్చులు పోగా, రూ.1.35 లక్షల ఆదాయంలో సుమారు రూ.55,000 మిగలవచ్చు. అమ్మకాలు ఇంకా పెరిగితే లాభాలు భాగా కనిపిస్తాయి. దగ్గర్లోని ఆఫీసులు, కంపెనీలు, చిన్న చిన్న ఫంక్షన్లు, కుటుంబ వేడుకలకు బల్క్ ఆర్డర్లు తీసుకోవచ్చు. చివరగా, రోజుకు 50 ప్లేట్లు అమ్మడం అనేది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. అసలు