© 2026 nimisham.in

విమానయాన సంస్థల ప్రకారం, ఎండిన కొబ్బరి, అంటే కొబ్బరి చిప్పలు (కొబ్బరి) చాలా ప్రమాదకరం. వీటిలో నూనె శాతం ఎక్కువగా ఉండటం వల్ల, వాటంతట అవే మంటలు అంటుకునే ప్రమాదం ఉంది.
అందుకే విమానం లగేజీలో ఉంచినప్పుడు, అక్కడి వేడికి ఇది అగ్ని ప్రమాదానికి దారితీయొచ్చు.
ఎండిన కొబ్బరిని చెక్-ఇన్ బ్యాగేజీలో తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. హ్యాండ్ బ్యాగ్ లేదా చెక్-ఇన్ బ్యాగ్.. దేనిలోనూ కొబ్బరి చిప్పలను తీసుకెళ్లలేరు. అది పచ్చి కొబ్బరికాయ అయినా, ఎండిన కొబ్బరికాయ అయినా సరే, పూర్తిగా తీసుకెళ్లకూడదు. స్పైస్‌జెట్ వంటి కొన్ని విమానయాన సంస్థలు కొబ్బరికాయను అనుమతిస్తాయి. కానీ, అది కొబ్బరి చిప్పలు అయి ఉండకూడదు. కొబ్బరికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, సరిగ్గా ప్యాక్ చేసి చెక్-ఇన్ లగేజీలో తీసుకెళ్లవచ్చు. అయితే, సరైన ప్యాకింగ్ చాలా ముఖ్యం. ఆధ్యాత్మికం: అన్ని సమస్యలను దూరం చేసే కొబ్బరికాయ పూజ! డబ్బును ఆకర్షించే పరిహారం ఇదే!
విమానం లగేజీ ఉంచే కార్గో ప్రాంతంలో గాలి, వెలుతురు సరిగా ఉండవు. కొబ్బరి చిప్పల నుంచి వెలువడే వేడి అగ్ని ప్రమాదానికి దారితీయొచ్చు. ఒకవేళ మంటలు అంటుకుంటే, విమానం ఎత్తులో ఉండటం, పరిమిత సౌకర్యాలు ఉండటం వల్ల దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. కొబ్బరి బోండాలను కూడా మీరు క్యాబిన్ బ్యాగ్‌లో తీసుకెళ్లలేరు. దీనికి విమానయాన సంస్థలు అనుమతి ఇవ్వవు. భద్రతా నిబంధనల ప్రకారం, నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ ద్రవ పదార్థాలను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది.
ఒకవేళ మీరు నిషేధాన్ని ఉల్లంఘించి విమానంలో కొబ్బరికాయ తీసుకెళ్తే, ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది లగేజీ తనిఖీల్లో దాన్ని స్వాధీనం చేసుకుంటారు. కస్టమ్స్ నిబంధనల ప్రకారం మీకు హెచ్చరిక జారీ చేయవచ్చు లేదా జరిమానా విధించవచ్చు. నిర్ణీత పరిమాణం కంటే ఎక్కువ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ తీసుకెళ్లలేరు. బిర్యానీ వంటి వండిన ఆహార పదార్థాలకు కూడా అనుమతి లేదు. స్పాంజ్ కేక్, స్వీట్లు, బేకరీ ఐటమ్స్, పచ్చి చేపలు లేదా మాంసం, ఊరగాయలు వంటివి కూడా తీసుకెళ్లకూడదు. పొడి లేదా పూర్తి మసాలా దినుసులపై కూడా నిషేధం ఉంది.