ఇంటర్నెట్‌డెస్క్: దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వి.వెంకటేశ్వరరావు (V Venkateswara Rao) వినూత్నంగా ఈ వేడుకల్ని నిర్వహించారు. ఐరోపా ఖండంలోనే ఎత్తైన శిఖరం మౌంట్ ఎల్బ్రస్ (Mount Elbrus) ను శనివారం ఉదయం 8 గంటలకు అధిరోహించిన ఆయన.. జాతీయ జెండాను ఎగురవేశారు. దాంతోపాటు 100 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బందికి తన విజయాన్ని అంకితం ఇచ్చారు. ఈ శిఖరం రష్యాలో ఉంది. దాని ఎత్తు 5,642 మీటర్లు. ఎలబ్రస్ను విజయంతంగా అధిరోహించిన వెంకటేశ్వరరావు.. ఎవరెస్ట్‌ను నెక్ట్స్ టార్గెట్‌గా పెట్టుకోవడం విశేషం. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.