
తణుకు: ఈవో దౌర్జన్యం నశించాలంటూ బుధవారం ఇరగవరం మండలం రేలంగిలో పలువురు రైతులు నిరసనకు దిగారు. 50 ఏళ్లకు పైగా సాగు చేసుకుంటున్న తమ భూములను శ్రీతాటకేశ్వర అండ్ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం భూమలు ఆక్రమించారంటూ ఆలయ ఈవో సూర్యనారాయణ నోటీసులు జారీ చేశారని రైతులు పేర్కొన్నారు. నోటీసులకు 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని చెప్పారని, తాము సమాధానం ఇవ్వడానికి వస్తే ఈవో తీసుకోలేదని రైతులు వాపోయారు. నోటీసులకు సమాధానం ఇస్తే ఎందుకు తీసుకోరని రైతులు నిరసనకు దిగారు. ఉద్దేశపూర్వకంగానే తమ భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రైతులు మండిపడ్డారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.