హైదరాబాద్ పాతబస్తీలో ఓ వింత పెళ్లి ఘటన కలకలం రేపింది. ఉదయం పరిచయం అయిన యువతితో ఒక యువకుడు.. అదే రోజు మధ్యాహ్నం పెళ్లి తంతు కానిచ్చేశాడు. ఇక సాయంత్రం పూట షాపింగ్ చేసి.. రాత్రి డిన్నర్ కూడా చేశాడు. ఆ తర్వాత శోభనం కోసం వారిద్దరూ కలిసి ఒక హోటల్‌కు వెళ్లారు. అయితే ఆ నవవరుడికి తెల్లారేసరికి ఊహించని షాక్ ఎదురైంది. పెళ్లి చేసుకున్న యువతి కనిపించకుండా పోవడంతో చివరికి పోలీసులను ఆశ్రయించి అసలు విషయం చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసిన బహదూర్‌పురా పోలీసులు.. ఆ యువతి ఆచూకీని కనిపెట్టే పనిలో పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.బాధిత యువకుడు చేసిన ఫిర్యాదు ప్రకారం.. తనకు మంచి సంబంధం వచ్చిందని చెప్పడంతో ఓ మహిళ ద్వారా యువతిని పరిచయం చేశారని తెలిపాడు. యువతిని కలిసిన కొద్దిసేపటికే తనను పెళ్లి చేసుకునేందుకు ఆమె అనుమతి తెలిపిందని పేర్కొన్నాడు. అదే రోజు వివాహం కూడా జరిపించినట్లు వెల్లడించాడు. పెళ్లికి ముందే వధువు పెళ్లి పేరుతో వరుడి డబ్బులతో వేల రూపాయల విలువైన షాపింగ్ చేసినట్లు ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. పెళ్లి తర్వాత కొత్త దంపతులు ఇద్దరూ కలిసి బయటికి వెళ్లి డిన్నర్ కూడా చేసినట్లు వివరించాడు.ఆ తర్వాత శోభనం కోసం ఓ హోటల్లో గది తీసుకున్నట్లు ఆ యువకుడు వెల్లడించాడు. అయితే గదిలో ఉన్న సమయంలో తనకు మూడ్ లేదని.. కొబ్బరి నీళ్లు తీసుకురావాలని చెప్పి వరుడిని.. వధువు బయటకు పంపినట్లు పోలీసులకు తెలిపాడు. అనంతరం కొద్దిసేపటి తర్వాత తనకు నడుము నొప్పిగా ఉందని.. ఇంటికి వెళ్లాలని చెప్పడంతో ఆమెను వరుడు కారులో పంపించినట్లు వివరించాడు.ఇంతలో వధువు అక్కగా పరిచయం చేసుకున్న ఓ మహిళ తనకు ఫోన్ చేసిందని నవవరుడు తెలిపాడు. ఇంట్లోనే శోభనం ఏర్పాట్లు చేశామని.. అక్కడికి రావాలని ఆమె సూచించింది. దీంతో ఆమె చెప్పిన అడ్రస్‌కు వరుడు వెళ్లగా.. అక్కడ