
విజయనగరం: ‘భోగాపురం విమానాశ్రయం భద్రత విషయంలో రాజీపడం.. ప్రయాణికులతో స్నేహపూర్వకంగా ఉంటూ సేవలందిస్తాం. యాజమాన్యం, విమానయాన, ఇతర భాగస్వామ్య సంస్థలతో సమన్వయంతో పనిచేస్తూ.. కార్యకలాపాలు సురక్షితంగా జరిగేలా కృషిచేస్తాం’ అని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ రంజన్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈనెల 17 నుంచి సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఐఎస్ఎఫ్ శనివారం ఇండక్షన్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ జనరల్ మాట్లాడారు. తొలిరోజు నుంచే దేశీయ, అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు సిద్ధంగా ఉండటం గొప్ప విజయంగా పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు ప్రపంచంలోని దేశాలతో అనుసంధానం ఏర్పడనుందన్నారు. విమానాశ్రయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కీర్తిచక్ర పురస్కార గ్రహీత ధీరేంద్రనాథ్ ప్రకాష్‌సింగ్, కానిస్టేబుల్ పోతురెడ్డి అప్పలనాగ కుటుంబ సభ్యులను సత్కరించారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ అదనపు డైరెక్టర్ జనరల్ వినీతా ఠాకూర్, ఐజీ శరవణన్, జీఎంఆర్ సీఈవో కమల్ జీత్ సింగ్ కాల్రా పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు