
విశాల్ (Vishal) స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘మకుటం’ (makutam movie). దుషార విజయన్(Dushara Vijayan), అంజలి(Anjali) కథానాయికలు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విశాల్ ఓ కార్యక్రమంలో సరదాగా సంభాషించారు. 5 ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. ఆ ‘పాంచ్ పటాకా’ ఇదీ. నన్ను చూస్తే ఐఐటీలో చదువుకున్నవాడిలా కనిపిస్తున్నానా ఏంటి? నేను బ్యాక్బెంచర్నే. మా బ్యాక్ బెంచ్ గ్రూప్‌లో ఉన్నవారిలో ఒకరు ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి. మరొకరు మాజీ విద్యాశాఖ మంత్రి. నేనేమో సినిమా హీరోనయ్యా. కాలేజ్‌లో ఉన్నప్పుడు మీరు చేసిన క్రేజీ థింగ్? స్కూల్లో చదువుతున్నప్పుడు క్లాస్ ఎగ్గొట్టి ‘శివ’ సినిమాకెళ్లా. ప్రిన్సిపల్ మా అమ్మానాన్నలను పిలిపించి గట్టిగా క్లాస్ తీసుకున్నారు. కాలేజ్‌లో అయితే స్టూడెంట్ ఎలక్షన్ల టైంలో గొడవపడ్డా. అప్పుడు కూడా అమ్మానాన్నలకు కంప్లైంట్ వెళ్లింది. ప్రిన్సిపల్ రూంలో సేమ్ సీన్ రిపీట్. మీకు యాక్టర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? యాక్టర్ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ‘శివ’ చూసినప్పటి నుంచే డైరెక్టర్ అవ్వాలనుకున్నా. డిగ్రీ పూర్తయ్యాక హీరో అర్జున్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా జాయినయ్యా. ఆయనే నన్ను యాక్టింగ్ వైపు ఎంకరేజ్ చేశారు. అలా ‘ప్రేమ చదరంగం’తో నటుడిగా మారా. డైరెక్టర్ లింగుసామి వెంటపడి, ఆయన్ను బతిమాలి ‘పందెం కోడి’లో హీరోగా నటించా. అది సూపర్‌హిట్టైంది. సెట్లో మీరు ఎప్పుడైనా ప్రాంక్ చేశారా? ‘భయ్యా’ షూటింగ్ టైంలో డ్యాన్స్ మాస్టర్‌తో కలసి హీరోయిన్ ప్రియమణి(Priyamani)పై చేసిన ప్రాంక్‌ను మర్చిపోలేను. ఓ పాట షూట్ చేస్తున్నప్పుడు ప్రియమణి ఫ్రేమ్‌లో ఉండాల్సిన అవసరం లేకపోయినా, ఆమెకు డ్యాన్స్ మూమెంట్ ఉందని చెప్పాం. క్లిష్టమైన డ్యాన్స్ స్టెప్ చూపించి వేయమన్నాం. ఆమె బాగా ట్రై చేస్తోంది కానీ సరిగా రావట్లేదు. నాకు కోపం వచ్చినట్లు నటించి ఆమె మీద గట్టిగా అరిచి సెట్ నుంచి బయటకు వెళ్లా. కాసేపటికి వచ్చి