
అనకాపల్లి పట్టణం: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఇంట్లో ఒక మొక్క ఉండాలన్న నినాదంతో అనకాపల్లిలోని చింతామణి గణపతి దత్తక్షేత్రంలో మొక్కలతో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమ ఆకట్టుకుంటోంది. సిరసపల్లిలోని చింతామణి గణపతి దత్త క్షేత్రంలో 16 వేల మొక్కలతో వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో మొక్కలతో అలంకరించడానికి 60 వేల మొక్కల వరకు వినియోగించారు. వినాయక ఉత్సవాల్లో భాగంగా ఈనెల 14 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ట్రస్టీ రాజు తెలిపారు. సోమవారం వినాయక ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్వామి వారి విగ్రహాన్ని ప్రారంభించిన అనంతరం ప్రత్యేక పూజలతో భక్తులకు దర్శనం కల్పించనున్నారు. సోమవారం సాయంత్రం ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు స్వామివారిని దర్శించుకోనున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





