
ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె (Sowcar Janaki).. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జన్మించిన షావుకారు జానకి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 400కు పైగా చిత్రాల్లో నటించారు. కథానాయికగా, బామ్మగా, అత్తగా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆమె ప్రస్థానం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఈ కథనం చదివారా: ఇల్లు గడవక నటిగా మారి.. షావుకారు జానకి జీవితమిది
..