
ఇంటర్నెట్ డెస్క్: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ (Gautam Adani)పై ఉన్న క్రిమినల్ అభియోగాలను అమెరికా కోర్టు (US Court) కొట్టి వేసింది. దీంతో మోసం, లంచం ఆరోపణలకు సంబంధించిన కేసులో దాదాపు రెండేళ్లుగా సాగుతున్న విచారణ ముగిసింది. కానీ మోసం, లంచం (Fraud, Bribery) కేసును ఉపసంహరించుకోవాలనే న్యాయ శాఖ నిర్ణయంపై న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర నిందితులపై అభియోగాలను కొట్టివేయాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి అవసరమయ్యే మరిన్ని వివరాలను సమర్పించాలని న్యాయ శాఖను ఆదేశించింది. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని గౌతమ్ అదానీ స్వాగతించారు. న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకమే గెలిచిందన్నారు. సౌర విద్యుత్ సరఫరా ఒప్పందాలు దక్కించుకునేందుకు భారతీయ అధికారులకు సుమారు 250 మి. డాలర్ల లంచాలు చెల్లించారనేది అదానీపై ప్రధాన ఆరోపణ. అమెరికా మార్కెట్ల నుంచి నిధులు సమీకరించేటపుడు, ఈ విషయాన్ని బయటపెట్టకుండా పెట్టుబడిదార్లను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ.. అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ (2024లో) ఉన్నప్పుడే అదానీ, మరో ఏడుగురిపై నమోదు చేసిన అభియోగాలను కొట్టివేయాలని న్యాయ శాఖ కోరింది. ఇదీ చదవండి: ట్రంప్‌నకు ‘ట్రూత్’ కష్టాలు.. రూ.2వేల కోట్ల నష్టం గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు