హైదరాబాద్ పాతబస్తీలో లాల్‌దర్వాజా బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాస బోనాల సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన బండి సంజయ్ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్‌గా అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు.పాతబస్తీలో బోనాల ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహించడంతో పాటు.. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు భారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఈ క్రమంలోనే 2029లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్సవాల నిర్వహణకు తగిన స్థాయిలో నిధులు కేటాయించడం లేదని బండి సంజయ్ తీవ్రంగా విమర్శించారు. లాల్‌దర్వాజా బోనాలకు ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోవని పేర్కొన్నారు. ఇతర పండుగలకు కేటాయించే నిధులతో పోలిస్తే బోనాలకు తక్కువ ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆలయాల అభివృద్ధికి ఇచ్చిన హామీలు అమలు కాలేదని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు హిందూ సమాజం, ఆలయాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన విమర్శించారు. అయితే ఇవన్నీ తన రాజకీయ విమర్శలేనని.. హిందూ సమాజానికి సంబంధించిన అంశాలపై మాట్లాడటం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణకు యువత ముందుకు రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.ముఖ్యంగా జెన్‌జీ తరం ఆధ్యాత్మిక, సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆలయాల పరిరక్షణ, గోరక్షణ, హిందువుల భద్రత వంటి అంశాలపై తాను నిరంతరం మాట్లాడుతానని స్పష్టం చేశారు. చరిత్రను వాస్తవ కోణంలో భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని కూడా తెలిపారు. తెలంగాణ సాయుధ