UK War Loan Response : బ్రిటీష్ పాలన కాలం నాటి 109 సంవత్సరాల ప్రాచీన యుద్ధ రుణ పత్రం ద్వారా కొన్ని నెలల క్రితం వార్తల్లో నిలిచిన మధ్యప్రదేశ్ నివాసి 63 ఏళ్ల వివేక్ రూథియా.. రికవరీ ప్రయత్నాల్లో కీలక పురోగతి లభించింది. బ్రిటన్ రుణ నిర్వహణ కార్యాలయం (డీఎమ్ఓ) నుంచి తమ కుటుంబ దావాకు సంబంధించి తొలిసారిగా అధికారిక ప్రత్యుత్తరం అందిందని ఆయన వెల్లడించారు. బ్రిటీష్ అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లిన తర్వాత.. అసలు ఆధారాలు, సంబంధిత లేఖలను పంపాల్సిందిగా వారి న్యాయవాదికి అధికారిక ఇమెయిల్ వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు."డబ్బు కంటే గౌరవమే ముఖ్యం"యూకే ప్రభుత్వం నుంచి సమాధానం రావడంపై వివేక్ రూథియా హర్షం వ్యక్తం చేశారు. "ఈ దశలో వారి నుంచి సమాధానం వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఈ ప్రక్రియ ఒక తార్కిక ముగింపునకు చేరుతుందని ఆశిస్తున్నాను. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.. ఇప్పుడు ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య" అని వ్యాఖ్యానించారు. తమ వాదనకు మద్దతుగా ఉన్న చారిత్రక పత్రాలు, పాత లేఖలను వారి న్యాయవాదుల బృందం క్రోడీకరిస్తోందని.. త్వరలోనే అధికారికంగా యూకే అధికారులకు పంపుతామని తెలిపారు. 109 ఏళ్ల నాటి ఈ అప్పు రికార్డులు వారి వద్ద ఇంకా భద్రంగా ఉన్నాయో లేదో బ్రిటీష్ అధికారులు సరిచూసుకోవాలని కోరారు.1917 నాటి రూ.35,000 బాకీ..ఈ వివాదానికి మూల కారణం.. 1917 జూన్ 4 నాటి ఒక చారిత్రక పత్రం. మొదటి ప్రపంచ యుద్ధంలో సైనిక వ్యయం కోసం ప్రైవేట్ వ్యక్తులు, వ్యాపారుల నుంచి బ్రిటీష్ పాలకులు అప్పులు తీసుకునేవారు. ఇందులో భాగంగా వివేక్ రూథియా తాతగారైన సేత్ జుమ్మా లాల్ రూథియా 5.5 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.35,000 రుణాన్ని ఇచ్చారు. 1937లో జుమ్మా లాల్ కన్నుమూశారు. 1947లో బ్రిటీష్ వారు భారత్ వదిలి వెళ్లారు. అయితే