© 2026 nimisham.in
పిల్లలు ఏడ్చేటపుడు భావోద్వేగ మద్ధతు కోరుకుంటారు. అలాంటపుడు వారిని దగ్గరకు తీసుకుని హగ్ ఇస్తే కాస్త కుదుటపడతారు. అయితే కేవలం అవసరం అయినపుడే. మరీ ఎక్కువగా చేస్తే గారాబం చేసినట్లుగా ఉంటుంది. పిల్లలు కోపంతో ఉన్నపుడు వారి మాటలు వినండి. వారేం చెబుతున్నారో వింటేనే సమస్య అర్థమవుతుంది. కాబట్టి ఒకసారి వారు చెప్పేది విని తర్వాత వారికి నచ్చజెప్పండి.5 పిల్లలు భయపడుతున్నట్లు గమనిస్తే వారి చేతులు పట్టుకుని నచ్చజెప్పండి. దీనిద్వారా పిల్లలలో భయం పోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లలకు ఏదైనా విషయంలో ఓటమి ఎదురైతే వారికి ఎమోషనల్ సపోర్ట్ చాలా అవసరం. అలాంటి వారిని దగ్గర తీసుకుని మరింత ప్రోత్సహించాలి. అప్పుడే వారు విజయం సాధించగలుగుతారు. పిల్లలు తప్పు చేయడం సహజమే. దానిని చూసి వెంటనే రియాక్ట్ కావొద్దు. దానికి గల కారణం తెలుసుకుని వారికి సరైన మార్గదర్శకత్వం చేయాలి. అప్పుడు వారు సరైన బాటలో పయనిస్తారు. కొంతమంది పిల్లలు మొండిగా వ్యవహరిస్తారు. ఇలాంటి వారి మొండితనం తగ్గించేందుకు వారికి ధ్యానం, యోగా వంటివి పరిచయం చేయండి. దీనివల్ల పిల్లలు బ్యాలెన్స్‌గా ఉంటారు. ప్రతిరోజూ పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలి. అప్పుడే వారిలో భయం పోయి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పిల్లలు మీతో మాట్లాడటం చాలా అవసరం. మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి రోజూ పిల్లలతో మాట్లాడండి. వారిని కూడా ఓపెన్‌గా మాట్లాడమని చెప్పండి. పిల్లలలో ఏ సమయంలో ఏం చేయాలని కంఫ్యూజన్ ఉంటుంది. ఇది పోగొట్టేందుకు వారికి సరైన డైలీ ప్లాన్ రెడీ చేయండి. ఏ సమయంలో చదవాలి, ఏ సమయంలో ఆడుకోవాలి అనేది వారికి చెప్పండి. ఇది వారి క్రమశిక్షణ మెరుగుపరుస్తుంది
.