© 2026 nimisham.in
నేరేడు పండ్లలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని అదుపులో ఉంచి షుగర్ రాకుండా కాపాడుతుంది. దీంతో కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. అందుకే లివర్ హెల్త్ కోసం నేరేడు పండ్లు తినడం మంచిదని సైన్స్ డైరెక్ట్ రీసెర్చ్‌లు తెలిపాయి. బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపర్చి కాలేయంలో విష పదార్థాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. తద్వారా కాలేయాన్ని ఎల్లపుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. యాపిల్ పండ్లలో పెక్టిన్ అనే సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణాశయం నుంచి విష పదార్థాలను బయటకు పంపి కాలేయంపై ఒత్తిడి తగ్గిస్తుంది. తద్వారా లివర్ ఎల్లపుడూ హెల్తీగా ఉంటుంది. ఉసిరిలోని విటమిన్ సి, టానిన్స్ కాలేయ కణాలను హెల్తీగా ఉంచుతాయి. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. తద్వారా లివర్ హెల్తీగా ఉంటుంది. నిమ్మ, బత్తాయి, నారింజ, గ్రేప్‌ఫ్రూట్ లాంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కాలేయం ఎంజైమ్ పనితీరు మెరుగుపర్చి విష పదార్థాలను బయటకు పంపిస్తాయి. తద్వారా లివర్ హెల్తీగా ఉంటుంది. గ్రేప్స్‌లో రెస్వరట్రాల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఇంఫ్లమేషన్, ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాలేయ కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. తద్వారా లివర్‌ను హెల్తీగా ఉంచుకోవచ్చు. దానిమ్మలోని పాలిఫినాల్స్ ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించి కాలేయం పనితీరు మెరుగుపరుస్తాయి. ఫ్యాటీ లివర్, లివర్ సిర్రోసిస్ వంటి కాలేయ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతాయి. స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, క్రాన్బెర్రీ లాంటి బెర్రీ పండ్లలో ఆంథోసయానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి, ఇంఫ్లమేషన్ నుంచి కాలేయాన్ని కాపాడుతాయి. లివర్ సంబంధ సమస్యలు రాకుండా నివారిస్తాయి. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి విష పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఇందులోని సిట్రులిన్ కాలేయాన్ని హెల్తీగా ఉంచుతుంది
.