
Chiranjeevi
సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ చూసిన పలువురు హీరోలు మళ్ళీ పొంగల్ బరిపైనే గురి పెట్టారు.. వారిలో టాప్ స్టార్స్, మీడియం స్టార్స్, యంగ్ హీరోస్ ఉన్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. ఆ ముచ్చటేంటో చూద్దాం. టాలీవుడ్లో సంక్రాంతి (Pongal Movies) సీజన్‌కు ఉన్న క్రేజ్ మరో పండుగకు లేదంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు పొంగల్ తరువాత సమ్మర్, దసరా, క్రిస్మస్ సీజన్స్ కు సినిమాలు వచ్చి అలరించేవి. కానీ, ఇప్పుడు అనేకమంది తెలుగు స్టార్స్ సంక్రాంతి బరిపైనే గురి పెడుతున్నారు. అలా ఈ సారి పలువురు స్టార్స్ ముగ్గుల పండుగకు మురిపించే ప్రయత్నం చేస్తున్నారు. వారి సినిమా టైటిల్స్ సైతం ఆసక్తిని కలిగిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)- బాబీ కాంబోలో రెండో సినిమా ముందు నుంచీ పొంగల్ కే వస్తుందని వినిపిస్తోంది. ఈ మూవీకి 'కదిరి నరసింహుడు', 'కాకాజీ' అన్న టైటిల్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి పలుమార్లు సంక్రాంతి సంబరాల్లో సక్సెస్ సాధించారు. పాలిటిక్స్ వీడి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన తరువాత చిరంజీవికి బంపర్ హిట్స్ చూపించిన "ఖైదీ నంబర్ 150, వాల్తేరు వీరయ్య, మన శంకరవరప్రసాద్ గారు" చిత్రాలు పొంగల్ కే ప్రేక్షకులను పలకరించడం గమనార్హం. అందువల్ల తన కొత్త సినిమాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేసే దిశగా చిరంజీవి అడుగులు వేస్తున్నారు. మరో స్టార్ హీరో వెంకటేశ్ (Venkatesh) కూడా పలుమార్లు సంక్రాంతి బరిలో గ్రాండ్ సక్సెస్ చూశారు. వెంకీ నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' 2025 బ్లాక్ బస్టర్ గా నిలచింది... అలాగే ఆయన కేమియో రోల్ పోషించిన సమన శంకరవరప్రసాద్ గారు' కూడా బంపర్ హిట్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తోన్న సినిమాను కూడా పొంగల్ లోనే రిలీజ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు మేకర్. ఈ చిత్రానికి 'జనవరి 12 విడుదల' అనే టైటిల్‌ను ఖరారు