
ఇంటర్నెట్ డెస్క్: టెక్ దిగ్గజం యాపిల్‌లో (Apple) కీలక నాయకత్వ మార్పు జరిగింది. 15 ఏళ్లుగా సంస్థ సీఈవోగా కొనసాగిన టిమ్ కుక్ (Tim Cook) ఆ పదవి నుంచి వైదొలిగారు. ఆయన స్థానంలో జాన్ టెర్నస్ (John Ternus) సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. 2011 ఆగస్టులో సీఈవో బాధ్యతలు స్వీకరించిన కుక్.. సంస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ‘‘రేపటి నుంచి నా పదవి మారుతుంది, కానీ యాపిల్ సంస్థపై నాకున్న ప్రేమ ఎప్పటికీ మారదు. నిరంతరం నాకు స్ఫూర్తిగా నిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. తదుపరి నిర్వర్తించాల్సిన బాధ్యతలపై నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. సీఈవో పదవి నుంచి వైదొలిగినప్పటికీ.. కుక్ యాపిల్‌కు దూరం కావడం లేదు. ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. సంస్థకు సంబంధించిన కీలక అంశాల్లో సహకరించనున్నారు. 2011లో సుమారు 350 బిలియన్ డాలర్లుగా ఉన్న యాపిల్ మార్కెట్ విలువ కుక్ సారథ్యంలో ప్రస్తుతం 4.5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన జాన్ టెర్నస్ (John Ternus) 2001లో యాపిల్‌లో చేరారు. ఆయన ఇప్పటి వరకు హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్, ఎయిర్‌పాడ్స్ తదితర ఉత్పత్తుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సెప్టెంబరు 9న జరగనున్న యాపిల్ కార్యక్రమంలో టెర్నస్ తొలిసారి సీఈవోగా వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు