
పిల్లలు చిన్నవాళ్లే, కానీ వాళ్ల అవసరాలకు మాత్రం పెద్ద లిస్టే ఉంటుంది. అందుకే, బుజ్జాయికి కంఫర్ట్‌తో పాటు పేరెంట్స్‌కు పీస్ ఇచ్చే ఈ చిన్న చిన్న గాడ్జెట్స్ మీకోసం... శబ్దాలకు... బుజ్జి బుజ్జి బ్రేక్! బుజ్జాయి నిద్రలోకి వెళ్లడం ఒక పెద్ద టాస్క్ అయితే, వెళ్లాక లేవకుండా కాపాడటం అంతకంటే పెద్ద టాస్క్! అందుకే, చుట్టూ ఎంత హడావుడి ఉన్నా శబ్దాన్ని తగ్గించే ఈ చిన్న ఇయర్‌మఫ్స్, ప్రతి పేరెంట్స్ బ్యాగ్‌లో ఉండాల్సిందే! ఇది చుట్టూ ఉన్న పెద్ద శబ్దాలను అనుకూలమైన వాల్యూమ్‌లో తగ్గించేలా రూపొందించారు. మృదువైన ఇయర్ ప్యాడ్స్, సర్దుబాటు చేసుకునే హెడ్‌బ్యాండ్ ఉండటంతో చిన్నారులకు సౌకర్యంగా పెట్టుకోవచ్చు. చెవులపై ఎక్కువ ఒత్తిడి పడకుండా డిజైన్ చేయడంతో విమాన ప్రయాణాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, కచేరీలు లేదా రద్దీ ప్రదేశాల్లోనూ ఉపయోగపడతాయి. మడిచి చిన్నగా చేసుకోవచ్చు కాబట్టి ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టుకోవడమూ ఈజీ. అప్పుడే పుట్టిన బుజ్జాయిల నుంచి మూడు సంవత్సరాల వయసు బుజ్జాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వీటి ధర రూ.1000. కింద పడినా... స్నాక్ పడదు! అమ్మ కష్టపడి స్నాక్ రెడి చేసి పెడితే... బుజ్జోడు మాత్రం ఒక్క సెకనులో బోర్లించేయడం కామనే! ఇక స్నాక్స్ నేలపాలయ్యే సీన్ కు ఈ స్పిల్ ప్రూఫ్ కప్‌తో చెక్ పెట్టొచ్చు. పిల్లలు కప్‌ను షేక్ చేసినా, పిండినా, కింద పడేసినా... లోపలున్న స్నాక్స్ బయటకు రాకుండా సిలికాన్ ఫ్లాప్ అడ్డుకుంటుంది. ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారైన ఈ కప్ చిన్న చేతులకు సులభంగా పట్టుకునేలా ఉంటుంది. పిల్లలు తమంతట తామే స్నాక్స్ తినడం నేర్చుకోవడానికీ ఉపయోగపడుతుంది. మూత ఉండటంతో బ్యాగ్‌లో పెట్టుకుని బయటకు తీసుకెళ్లడమూ ఈజీ. కారులో, పార్కులో, ట్రావెల్లో... ఎక్కడైనా స్నాక్ టైమ్ నో టెన్షన్! అన్ని భాగాలనూ విడదీసి శుభ్రం చేసుకోవచ్చు. డిష్వాషర్లోనూ వేయొచ్చు. బుజ్జోడు కింద పడినా, స్నాక్స్ మాత్రం పడవు! ధర రూ.500. ఎక్కడైనా బుజ్జాయికి