
బరగఢ్: సంబల్పూర్ జిల్లా బామ్రా ప్రాంతంలో అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఇంటి గోడ కూలిపడటంతో రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం నుంచి ఈ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బామ్రా గోవింద్ పూర్ పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న న్యూ కాలనీలో అద్దెకు ఉంటున్న వివేక్ ఖర్సెల్, రంజులత నాయక్‌ల రెండేళ్ల కుమారుడు రాజ్బీర్ ఖర్సెల్పై ఒక్కసారిగా ఇంటి గోడ కూలిపడింది. దాంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.




