
ఈ ఏడాది సంక్రాంతి తర్వాత వరుస చిత్రాలతో వినోదాన్ని పంచిన నెల ఆగస్టు. అంతేకాదు, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను కూడా నమోదు చేశాయి. ఇప్పుడు అదే జోష్‌తో సెప్టెంబరు నెలలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. మరి ఏ వారం ఏయే చిత్రాలు వస్తున్నాయో చూసేయండి నాని (Nani) కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఇప్పటికే చిత్రీకరణపూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కయాదు లోహర్ కథానాయిక. మోహన్‌బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అణగదొక్కబడిన ఓ జాతికి నాయకుడైన హీరో.. కాకుల్లా ఛీ అనిపించుకున్న తన సమూహంతో కలిసి పోరుకు సిద్ధమైతే ఎలా ఉంటుందన్నది ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రంలో ఆసక్తికరంగా చూపించారు. నాని కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది. సిద్ధార్థ్ మల్హోత్రా, (Sidharth Malhotra) తమన్నా కీలక పాత్రల్లో నటించిన మిస్టీరియస్ థ్రిల్లర్ ‘ది వాన్’. (The VVAAN) దీపక్ మిశ్రా దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 25న (the vvan force of the forest release date) ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు, ‘అవెంజర్స్: ది ఎండ్‌గేమ్’ సెప్టెంబరు 25 రి-రిలీజ్ కానుంది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు