తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితావిడుదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు తమ పేరు జాబితాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 92 లక్షల మందికి నోటీసులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న వారు సెప్టెంబర్ 16లోగా స్పందించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో మీ పేరు వెతకడానికి ముందుగా మీ ప్రస్తుత పోలింగ్ బూత్, పార్ట్ నంబర్ తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరగడంతో కొంతమంది ఓటర్ల పాత బూత్ నంబర్లు మారే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల ఎన్నికల సంఘం సెర్చ్ పోర్టల్‌లో ఎపిక్ నంబర్ లేదా అందుబాటులో ఉన్న వ్యక్తిగత వివరాలతో మీ పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చని సూచించారు.ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ లిస్ట్‌లో పేరు ఎలా చెక్ చేసుకోవాలి? స్టెప్ 1: ఎన్నికల సంఘం అధికారిక ఓటర్ పోర్టల్‌లోని ఎలక్టోరల్ రోల్ డౌన్లోడ్ విభాగాన్ని ఓపెన్ చేయాలి. స్టెప్ 2: అక్కడ 2026 సంవత్సరం ఎంచుకోవాలి. స్టెప్ 3: రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం, భాష వంటి వివరాలను ఎంపిక చేయాలి. స్టెప్ 4: కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి. స్టెప్ 5: ఆ తర్వాత సంబంధిత పార్ట్ నంబర్, పార్ట్ పేరు సెలెక్ట్ చేసుకోవాలి. స్టెప్ 6: ‘Download Selected PDFs’పై క్లిక్ చేస్తే సంబంధిత ఓటర్ల జాబితా పీడీఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. స్టెప్ 7: PDFలో మీ పేరు, ఓటర్ వివరాలు ఉన్నాయో లేదో పరిశీలించాలి.ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ లిస్ట్‌లో పేరు లేకపోతే ఏం చేయాలి?ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో అర్హత ఉన్నప్పటికీ మీ పేరు కనిపించకపోతే సంబంధిత బీఎల్ఓ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలి. అవసరాన్ని బట్టి కొత్త ఓటరు నమోదుకు