
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana New EHS Guidelines: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంత కాలంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఈ మేరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ శుక్రవారం సాయంత్రం కీలక ప్రకటనను విడుదల చేసింది. సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నూతన స్కీమ్ అమలుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవో అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తోపాటు ఎంప్లాయిస్ ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అంతేకాదు తెలంగాణ స్టేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు హైదరాబాద్ లోని దిగ్గజ కార్పొరేట్ ఆసుపత్రులు అయిన అపోలో, యశోద, కిమ్స్, కాంటినెంటల్ ఆసుపత్రుల యాజమాన్యాల కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కొన్ని సాంకేతిక అంశాలపై క్లారిటీ రావడంతో.. కొత్త EHS పథకాన్ని తక్షణమే అమలు చేసేందుకు TSHA కార్పొరేట్ ఆసుపత్రులు ఏకగ్రీవంగా మొగ్గు చూపాయి. దీంతో నేటి నుంచే అర్హులైన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. సమావేశం అనంతరం న్యూ EHSకి సంబంధించిన సవరించిన మార్గదర్శకాల బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ఇందులో.. ఆసుపత్రుల ఎంపానెల్మెంట్ ప్రక్రియ చికిత్సా ప్రోటోకాల్స్ ఆసుపత్రుల బకాయిల (క్లెయిమ్‌ల) చెల్లింపులకు సంబంధించిన సరళీకృత విధానాలను పొందుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కార్పొరేట్ స్థాయి వైద్యం రూపాయి ఖర్చు లేకుండా అందాలన్నదే