
Kalyana Lakshmi Scheme: తెలంగాణ లో పేద మహిళల వివాహాల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక 'కల్యాణలక్ష్మి', 'షాదీముబారక్' పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. శాసనసభలో ఎలాంటి చట్టబద్ధత కల్పించకుండా, కేవలం ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పంపిణీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ఎలాంటి చట్టపరమైన ఆమోదం లేకుండా జీవోల ద్వారా తెచ్చిన పథకాలకు నిధులు వెచ్చించడం చెల్లదని స్పష్టం చేశారు. ఈ పథకాల అమలును నిలిపివేస్తూ స్టే విధించింది
.