
హైకోర్టులో పథకాలపై విచారణ ప్రజాధనం వృథాపై ప్రశ్నలు భూబాధితులపై స్పష్టతకు ఆదేశం Telangana High Court: తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు, విచారణకు సంబంధించి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (Telangana High Court)అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో చట్టబద్ధత లేని పథకాల కోసం ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృథా చేయడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ప్రజాధనాన్ని కేవలం ఉచిత పథకాలకే కాకుండా, నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల బాట పట్టించేందుకు ఉపయోగించి, దానిద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తే బాగుంటుంది కదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. TG Police Recruitement: పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 7,437 పోస్టుల భర్తీ ప్రారంభం.. కొత్త నిబంధనలు ఇవే భూసేకరణ బాధితుల సమస్యలపై ధర్మాసనం ప్రశ్నలు: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భూములు కోల్పోయిన భూ బాధితుల సమస్యల పట్ల కూడా న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. భూసేకరణ ప్రక్రియలో సరైన పరిహారం, న్యాయం అందక అనేకమంది బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని గుర్తుచేసింది. ఒకవైపు నిరుపేద భూ బాధితులకు న్యాయం చేయడంలో జాప్యం జరుగుతుండగా, మరోవైపు సంక్షేమ పథకాలకు భారీగా నిధులు వెచ్చించడంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. భూ బాధితుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరాలను సమర్పించాలని సూచించింది. స్టే ఎత్తివేతకు కోర్టును కోరిన ప్రభుత్వం: ఇదే సమయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ఉన్న స్టేను ఎత్తివేసి, నిలిచిపోయిన లబ్ధిదారులకు సహాయం అందించేలా వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టును కోరారు. పేద వర్గాల వివాహాలకు ఆర్థిక సాయం అందించే ఈ పథకాలు ఎంతో మందికి ఉపయోగపడుతున్నాయని వివరించారు. ఈ క్రమంలో భూ బాధితులకు సంబంధించిన పరిహారం, ఇతర అంశాలపై ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని రేపటి కల్లా తెలియజేయాలని ఆదేశిస్తూ