
అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ 65 ఏళ్ల వయస్సు పూర్తి అయిన సిబ్బందికి డబుల్ బెనిఫిట్స్ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష బెనిఫిట్ Anganwadi Retirement : తెలంగాణలో పనిచేస్తున్న అంగన్వాడీ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిటైర్మెంట్ సమయంలో అందించే సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం రెట్టింపు చేసింది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కొత్తగా అమలయ్యే నిబంధనల ప్రకారం.. 65 ఏళ్ల వయస్సు పూర్తి అయిన అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష చొప్పున సర్వీస్ ఎండ్ బెనిఫిట్ లభించనుంది. అలాగే, 60 ఏళ్లు దాటాక స్వచ్ఛందంగా వైదొలిగే అంగన్వాడీ సిబ్బందికీ కూడా ఇదే ప్రయోజనం వర్తించనుంది. కేంద్ర ప్రభుత్వం అందించే మిషన్ సక్షమ్ అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0 మార్గదర్శకాల ప్రకారం.. అంగన్వాడీ సిబ్బంది రిటైర్మెంట్ వయస్సును గరిష్టంగా 65 ఏళ్లుగా నిర్ణయించారు. అదే గతంలో అంగన్వాడీ టీచర్లకు రూ.1 లక్ష, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేలు ఉండేది. అయితే, ఇప్పుడు ఆ మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపు చేసింది. పెంచిన బెనిఫిట్స్ ప్రకారం.. అర్హత ఉన్న సిబ్బందికి చెల్లింపులు కూడా మొదలయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,572 మంది అంగన్వాడీ సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ కింద మొత్తం రూ.15.61 కోట్లు జమ చేసినట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. Read Also : Imran Khan Hospital : ఇమ్రాన్ ఖాన్‌కు ఏమైంది? ఆయన్ను తక్షణమే ఆస్పత్రికి తరలించండి.. పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ చెల్లింపుల్లో 473 మంది అంగన్వాడీ టీచర్లకు రూ.4.73 కోట్లు, 1,930 మంది హెల్పర్లకు రూ.9.65 కోట్లు అందాయి. పెంచిన ప్రయోజనాల కింద మరో 14 మంది టీచర్లకు రూ.28 లక్షలు, 59 మంది హెల్పర్లకు రూ.59 లక్షలు