© 2026 nimisham.in

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana SIR: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ కొనసాగుతుండగా.. ఈ ప్రక్రియపై రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు సాగిన సర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఓటర్ల జాబితా ముసాయిదా ప్రచురణ, ఫిర్యాదులు తదితర అంశాలపై ప్రకటన విడుదల చేసింది. సర్‌కు సంబంధించి ప్రత్యేక ప్రచారం కల్పిస్తామని ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను 17.08.2026న ఆయా ఈఆర్ఓ కార్యాలయాల్లో ప్రచురించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ జాబితాతో పాటు ఏఎస్‌డీడీ ఓటర్ల వివరాలను సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ( అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ముఖ్య వివరాలు, గడువులు క్లెయిమ్‌లు, అభ్యంతరాల గడువు: ఆగస్టు 17 నుంచి ఈనెల 16వ తేదీ వరకు నోటీసుల జారీ, పరిష్కారం: 17.08.2026 నుండి 15.10.2026 వరకు ప్రత్యేక ప్రచార (స్పెషల్ క్యాంపెయిన్) తేదీలు - మొదటి విడత: ఈనెల 5 నుంచి 6వ తేదీ వరకు - రెండో విడత: ఈనెల 12వ తేదీ నుంచి 13 వరకు ప్రస్తుత పురోగతి మొత్తం 92,88,112 నోటీసులు రూపొందించగా 31,74,952 నోటీసులు అందాయి. 1,94,737 నోటీసులపై విచారణ పూర్తయింది. మిగిలిన నోటీసులను 119 మంది ఈఆర్ఓలు, 1,973 మంది ఏఈఆర్ఓల ద్వారా గడువులోగా విచారించనున్నారు. మొత్తం క్లెయిమ్‌లు, అభ్యంతరాలు: 9,07,292 - ఫారం-6 (కొత్త ఓటరు): 3,94,517 - ఫారం-6ఏ (ప్రవాస భారతీయులు): 6,346 - ఫారం-7 (పేర్ల తొలగింపు): 48,752
- ఫారం-8 (సవరణలు/మార్పులు): 4,57,677
ప్రత్యేక ప్రచార దినాలలో బీఎల్ఓలు, బీఎల్ఏలు పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంటారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలను లేదా ఈఆర్ఓ కార్యాలయాలను సందర్శించి తమ పేర్లను సరిచూసుకోవాలని, ఫారాలు 6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారి కోరారు.