
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Revanth Reddy London Tour: విదేశీ పర్యటన రద్దు చేయడంతో రేవంత్ రెడ్డి లండన్‌లో పర్యటిస్తున్నారు. ముందస్తు నిర్ణయమైన కార్యక్రమాలకు హాజరైన ముఖ్యమంత్రి వివిధ పనులు చేశారు. తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని.. లండన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా ముఖ్యమంత్రి శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన లండన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. తెలంగాణతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై అక్కడి విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమై తెలంగాణలో విద్యాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలు తెలుసుకున్నారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, చేపడుతున్న చర్యలను వివరించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తమ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆహ్వానం పలికారు. హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకురావాలని కోరారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. హైదరాబాద్, తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవకాశాలు, వాటికి లభించే ప్రయోజనాలను ఆక్స్ఫర్డ్ విశ్వావిద్యాలయ బృందానికి వివరించారు