తెలంగాణలోని బీసీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. మహిళలు ఇంటి నుంచే ఉపాధి పొందుతూ ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఉచిత ఆటోమేటిక్ కుట్టుమిషన్లను అందించేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1.19 లక్షల మంది బీసీ మహిళలకు ప్రయోజనం కల్పించనున్నారు.తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 కుట్టుమిషన్ల చొప్పున పంపిణీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కుట్టుమిషన్ విలువ రూ.12 వేలు కాగా.. లబ్ధిదారుల నుంచి ఎలాంటి మొత్తం వసూలు చేయకుండా 100 శాతం సబ్సిడీపై అందజేయనున్నారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలనుకునే అర్హులైన బీసీ మహిళలు ఆగస్ట్ 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.లబ్ధిదారుల ఎంపికలో పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల ప్రకారం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారమే ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కేవలం కుట్టుమిషన్లు పంపిణీ చేయడమే కాకుండా వాటిని సరిగ్గా వినియోగించుకునేలా అవసరమైన శిక్షణను కూడా అందించనున్నారు. మహిళలను ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మంత్రి పొన్నం పేర్కొన్నారు.మొదటి దశలో 1.19 లక్షల మంది మహిళలకు అవకాశం కల్పించనున్నారు. భవిష్యత్లో పథకాన్ని మరింత విస్తరించి అదనపు లబ్ధిదారులకు ప్రయోజనం అందించే అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించనుంది. ఇంటి వద్ద నుంచే కుట్టు పనులు