
సురేఖవాణి (Surekhavani) ఎప్పుడో ఆంటీ పాత్రలకు షిప్ట్ అయింది. హీరోయిన్లకు తల్లిపాత్రలు చేస్తూ ఆంటీగా మారింది. ఐతే, ఇటీవల ఆమె సినిమాల్లో ఎక్కువగా కనిపించలేదు. ఇటీవల విడుదలైన “కెజెక్” చిత్రంలో హీరోయిన్ యుక్తని కాపాడే ఆంటీగా కనిపించింది. ఇది తప్ప ఈ మధ్య ఆమె సినిమాలు చెయ్యలేదు. కూతురు సుప్రీతని హీరోయిన్ గా పరిచయం చేసి, ఆమె కెరీర్ ని నిలబెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు చేశారు సురేఖ. ఐతే, అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో, ఆమె మళ్ళీ తన కెరీర్ పైనే దృష్టి పెట్టనుంది. అందుకే, ఇప్పుడు మళ్ళీ తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టింది. తాజాగా ఆమె జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోని షేర్ చేసింది. దాంతో కుర్రాళ్ళు ఆంటీ మళ్ళీ సినిమాలు చేస్తున్నారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆమె వయసు విషయంలో రకరకాల వాదనలు ఉన్నాయి. తనకి ఇంకా 43 అని ఆమె చెప్తోంది. వికీపీడియాలో ఆమె వయసు 48 అని ఉంది. ఇండస్ట్రీలో ఆమె వయసు 50 అని అంటున్నారు. ఆమె కూతురుకి ఇప్పుడు పాతికేళ్ళు
.