వజ్రపు కొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరంలో చేపల వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు తెప్ప బోల్తాపడింది. ఈ ఘటనలో మత్స్యకారుడు సూరాడ విశాఖ (58) మృతి చెందాడు. గల్లంతయిన మరో ఇద్దరు మత్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మత్స్యకారులు రోజూమాదిరిగానే గురువారం వేకువ జామున చేపల వేట సాగించి, ఇంటికి తిరిగి వస్తున్నారు. అకస్మాత్తుగా పెద్ద అలలు రావడంతో తెప్ప బోల్తా పడినట్లు తెలిపారు. కెరటాల్లో చిక్కుకున్న విశాఖను రక్షించేందుకు యత్నించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య దానమ్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.