
పలాస: శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ పట్టణాల్లో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి పూజలు నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఇళ్లల్లో గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. వీధుల్లో ప్రత్యేక మండపాలు ఏర్పాటుచేసి విభిన్న కళాకృతుల్లో గణపతి విగ్రహాలను కొలువుదీర్చారు. విద్యుత్ దీపాలతో మండపాలను ప్రత్యేకంగా అలంకరించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, తన భర్త వెంకన్న చౌదరితో కలిసి తమ స్వగృహంలో వినాయక చవితి పండుగను నిర్వహించుకున్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.