
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఓ ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. కెమెరా వెనక ఉండి నటనను రాబట్టే దర్శకులు.. కెమెరా ముందుకు వస్తున్నారు. అలాగే హీరోలు కొంతమంది దర్శకులు అవుతున్నారు. అలా రెండు రకాలుగా మెప్పిస్తున్న దర్శకహీరోలు.. హీరోదర్శకులు ఎవరో చూద్దాం. దర్శకత్వం నుంచి హీరోలుగా! తమిళనాట అత్యంత విజయవంతమైన దర్శకుల్లో లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఒకరు. మొదట ‘మానగరం’ (2017) చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీశారు. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)ను సృష్టిస్తున్న ఈయన.. తాజాగా ‘డీసీ’ సినిమాతో హీరోగా మారారు. 2019లో వచ్చిన ‘కోమలి’ చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత 2022లో తానే సొంతంగా కథ రాసుకుని.. ‘లవ్ టుడే’ సినిమాతో హీరోగా మారారు. 2025లో వచ్చిన ‘డ్రాగన్’తో యాక్షన్ స్టార్‌గానూ మెప్పించిన ఆయన, ఇటీవల నిర్మాతగానూ మారారు. మొదట ‘వాలి’, ‘ఖుషి’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు ఎస్.జే. సూర్య (S. J. Suryah). ఆ తర్వాత తనను తాను వైవిధ్యమైన నటుడిగా మలచుకున్నారు. ‘న్యూ’ అనే చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించి, ప్రధాన తారాగణంగా నటించి హీరోగా అరంగేట్రం చేశారు. తర్వాత ‘మార్క్ ఆంటోని’ (2023) చిత్రంతో మెప్పించారు. ప్రస్తుతం ఆయన హీరోగా, విలన్‌గా బిజీగా ఉన్నారు. 90ల నాటి కామెడీ, యాక్షన్ చిత్రాలకు సుందర్ సీ (Sundar C) కేరాఫ్ అడ్రస్. ‘అరుణాచలం (1997)’, ‘అరణ్మనై సిరీస్, ‘కలకలప్పు (2012)’, చిత్రాలతో దర్శకుడిగా సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత ‘తలై నగరం (2006)’ సినిమాతో హీరోగా మారారు. అలాగే ‘ఇరుట్టు’, ‘ఐంధమ్ పదై’ తదితర చిత్రాల్లో హీరోగా నటించారు. ‘ఆటోగ్రాఫ్’ (2004) లాంటి క్లాసిక్ సినిమాకు చేరన్ (Cheran) దర్శకుడు. ‘సొల్ల మరంద కదై’ సినిమాతో