
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ (Kevin Pietersen) తన యూట్యూబ్ ఛానల్లో బ్యాటింగ్ ఛాలెంజ్‌లు, క్రికెటర్లతో సరదా ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు ఓ ఛాలెంజ్ విసిరాడు. ఇప్పటివరకు తయారైన ప్రతి ఒక్క క్రికెట్ బ్యాట్‌తో బ్యాటింగ్ చేసి వాటికి రేటింగ్ ఇవ్వమని కోరాడు. మరి మంధాన ఏ బ్యాట్‌తో ఎన్ని పరుగులు చేసింది, ఎంత రేటింగ్ ఇచ్చిందో ఈ వీడియోలో చూసేయండి
.





