సిబ్బంది కనిపిస్తున్నారు. అంటే ఖాళీగా కనిపిస్తున్నాయి.ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
మల్టీప్లెక్స్ రాకతో.. సింగిల్ స్క్రీన్ థియేటర్లు శాశ్వతంగా మూతపడుతుంటే... మరికొన్ని థియేటర్లు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి.అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తోంది. సింగిల్ స్క్రీన్ల సంక్షోభానికి అసలు కారణం ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది. స్టార్ హీరోలా? నిర్మాతలా? పెరిగిన టికెట్ ధరలా? లేక మారిపోయిన ప్రేక్షకుల అభిరుచులా? ఇలా రకరకాల కారణాలు చెబుతున్నారు.
ఇందులో స్టార్ హీరోల సినిమాల విడుదల గ్యాప్ కూడా ఒక ముఖ్యమైన కారణంగా కనిపిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేవారు. అదే పాత కాలంలో నెల లేదా రెండు నెలలకు ఒక సినిమాను విడుదల చేసేవారు. ఇపుడు యేడాదికి ఒక సినిమా విడుదల చేస్తే వారికి దండం పెట్టాల్సిందే. టెక్నాలజీ పెరిగడం మూలానా షూటింగ్ సమయం తగ్గాలి. కానీ ఇక్కడ మాత్రం యేళ్లకు యేళ్లకు బంకలా సినిమా షూటింగ్‌లు సాగదీస్తున్నారు.
కొన్నేళ్ళ క్రితం వరకు బడా స్టార్ హీరో సినిమా ఏడాదికి రెండు సినిమాలు కూడా విడుదలయ్యేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు.ఒక్కో సినిమా పూర్తి కావడానికి రెండు, మూడు సంవత్సరాలు పడుతోంది.దీనివల్ల సినిమాల నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతోంది. అదే సమయంలో నిర్మాతలపై వడ్డీ భారం కూడా పెరుగుతోంది.మరోవైపు... స్టార్ హీరో సినిమా కోసం ఎదురుచూసే థియేటర్ యజమానులకు కూడా ఈ గ్యాప్ పెద్ద సమస్యగా మారుతోంది.
సింగిల్ స్క్రీన్స్ కు కంటెంట్ లేకపోెవడం..
ప్రస్తుతం మన టాలీవుడ్లో భారీ ఓపెనింగ్స్ తీసుకురాగల స్టార్ హీరోలు కొద్దిమందే ఉన్నారు.ప్రభాస్ సినిమా అంటే భారీ క్రేజ్. ఎన్టీఆర్‌కు కూడా మాస్‌తో పాటు నేషనల్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు ఓన్ డబ్బింగ్ అనేది ఎన్టీఆర్‌కు పెద్ద ఎస్సెట్. రామ్ చరణ్ సినిమా అంటే భారీ అంచనాలు. అల్లు అర్జున్‌కు దేశవ్యాప్తంగా మార్కెట్ ఉంది. మహేష్ బాబు సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కానీ వీరి సినిమాల మధ్య గ్యాప్ పెరుగుతుండటంతో... థియేటర్లకు నిరంతరంగా ప్రేక్షకులను రప్పించే పెద్ద సినిమాల సంఖ్య తగ్గిపోతోంది.
ప్రభాస్ ఈ ఏడాది ‘ది రాజాసాబ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆయన సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి.రామ్ చరణ్ పెద్ది’తో బాక్సాఫీస్‌ను టచ్ చేశారు. కానీ తదుపరి సినిమా విడుదలపై ఇంకా క్లారిటీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.అల్లు అర్జున్ విషయానికి వస్తే... ‘పుష్ప’ సిరీస్ సినిమాల మధ్య భారీ గ్యాప్ కనిపించింది. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్ట్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహేష్ బాబు విషయానికి వస్తే... ‘గుంటూరు కారం’ తర్వాత రాజమౌళితో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’ మూవీపై దేశవ్యాప్తంగా అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా కోసం కూడా అభిమానులు చాలా కాలం వేచి చూడాల్సి వస్తోంది.ఎన్టీఆర్ కూడా వరుసగా భారీ ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఆయన సినిమాల మధ్య కూడా గ్యాప్ పెరుగుతోంది. సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి స్టార్ హీరోలే ఒక్కరే కారణం అని చెప్పడం కూడా పూర్తిగా కరెక్ట్ కాదు.OTT ప్రభావం పెరగడం...టికెట్ ధరలు పెరగడం...ప్రేక్షకుల వినోదపు అలవాట్లు మారడం వంటివి కూడా ఓ కారణంగా అని చెప్పొచ్చు.
చిన్న సినిమాలకు సరైన స్క్రీన్లు దొరకకపోవడం... అలాగే థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం...ఇవన్నీ కలిసి ఎగ్జిబిషన్ రంగంపై ఒత్తిడి పెంచుతున్నాయి.కానీ స్టార్ హీరోల సినిమాలు మాత్రం థియేటర్ మార్కెట్‌కు ఒక బూస్టర్ డోస్ లాంటివి.ఒక పెద్ద స్టార్ సినిమా వస్తే థియేటర్లలో సందడి పెరుగుతుంది. పక్కనే విడుదలయ్యే చిన్న, మీడియం సినిమాలకు కూడా ప్రేక్షకుల రాక పెరిగే అవకాశం ఉంటుంది.
అందుకే స్టార్ హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలన్నది కేవలం అభిమానుల డిమాండ్ మాత్రమే కాదు.. థియేట్రికల్ ఎకోసిస్టమ్‌కు కూడా అవసరంగా మారుతోంది. యేడాదికి రెండు సినిమాలు చేయడం సాధ్యం కాకపోయినా...కనీసం ఏడాదికి ఒక సినిమా చొప్పున ప్రేక్షకుల ముందుకు వస్తే...థియేటర్లకు రెగ్యులర్‌గా పెద్ద కంటెంట్ అందుతుంది. లేకపోతే... స్టార్ హీరోల సినిమాల కోసం నెలలు, సంవత్సరాలు ఎదురుచూస్తూ...మధ్యలో థియేటర్లను నిలబెట్టేది ఎవరు? అందుకే ఇప్పుడు ఇండస్ట్రీ ముందు ఉన్న అసలు ప్రశ్న ఉదయిస్తుంది.
సింగిల్ స్క్రీన్లను కాపాడాలంటే స్టార్ హీరోల వర్కింగ్ స్పీడ్ పెరగాలా? లేక మొత్తం థియేట్రికల్ వ్యవస్థలోనే మార్పులు రావాలా? సినిమా అనేది కేవలం హీరో, నిర్మాత, దర్శకుడి వ్యాపారం కాదు. థియేటర్ ఓనర్ నుంచి ప్రేక్షకుడి వరకు ఎంతోమంది జీవనాధారం. అందుకే స్టార్ హీరోల సినిమాలు వేగంగా రావడం ఒక పరిష్కారం కావచ్చు. కానీ సింగిల్ స్క్రీన్లకు పూర్వ వైభవం రావాలంటే మాత్రం మొత్తం ఇండస్ట్రీ కలిసి తీసుకునే నిర్ణయాలే కీలకం అని చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.