
గోరు వెచ్చని నీటిలో ఉప్పు వేయండి. ఈ నీటిని 30 సెకెన్ల పాటు పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగుతుంది. దీంతో చిగుళ్ల వాపు, చిగుళ్ల రక్తస్రావం తగ్గుతుందని హెల్త్‌లైన్ తెలిపింది.
ఒకటి లేదా రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనెను పుక్కిలించడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగుతుంది. చిగుళ్లు బలంగా మారుతాయి.
హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను నీటిలో కలిపి పుక్కిలించండి. 30 సెకన్ల పాటు ఈ మిశ్రమాన్ని పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా తయారవుతాయి.
కలబంద రసాన్ని 30 సెకెన్ల పాటు పుక్కిలించడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి. స్వచ్ఛమైన కలబంద జెల్ వాడితే చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి.
పసుపును కొద్దిగా చిగుళ్లకు రాయండి. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చిగుళ్ల వాపును కంట్రోల్ అవుతుంది.
బేకింగ్ సోడాను నీటిలో కలిపి పేస్ట్‌లాగా తయారు చేయండి. దీన్ని రాయడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి.
నీరు ఎక్కువగా తాగడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నీరు పుష్కలంగా తాగడం వల్ల చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయి.
జామ ఆకుల రసాన్ని లేదా జామ ఆకులు మరిగించిన నీటిని మౌత్‌వాష్‌గా ఉపయోగించండి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు చెడు బ్యాక్టీరియాను తొలగిస్తాయి. చిగుళ్లను దృఢంగా ఉంచుతాయి.
టీ ట్రీ ఆయిల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. టీ ట్రీ ఆయిల్‌ను పుక్కలించడం వల్ల చిగుళ్ల వాపు, రక్తస్రావం తగ్గుతుంది.






