
Siddipet Serial Murder Case: సిద్ధిపేట జిల్లా భూంపల్లి సీరియల్ మర్డర్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రజిత గతంలోనూ తన భర్త దుబ్బయ్యను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఆమె భర్త, మృతుల కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాలు సంచలనంగా మారాయి. రజిత గతంలో రెండుసార్లు తనను హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆమె భర్త దుబ్బయ్య ఆరోపించారు. ఒకసారి రోకలి బండతో తన తలపై మోది చంపేందుకు ప్రయత్నించిందని తెలిపారు. తాను ఉల్టా పడుకోవడంతో తలకు బదులుగా కాళ్లపై రోకలి బండతో కొట్టిందని చెప్పారు. మరోసారి వేడి నీళ్లు తనపై పోసి తీవ్రంగా హింసించిందని ఆరోపించారు. అనారోగ్యంతో ప్రస్తుతం మంచానికే పరిమితమైన దుబ్బయ్య.. తాను గతంలో కూలి పని చేసుకునేవాడినని, రజిత చర్యల కారణంగా తన పరిస్థితి దారుణంగా మారిందని వాపోయారు. తనను చంపేందుకు ప్రయత్నించిన రజితను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. రజిత తన మైనర్ కుమారుడిని కూడా డబ్బు, బంగారం ఆశ చూపి హత్యలకు ప్రేరేపించినట్లు సమాచారం. తన కుమారుడు చదువులో బాగా రాణించేవాడని దుబ్బయ్య తెలిపారు. పదో తరగతిలో 504 మార్కులు సాధించిన తన కుమారుడిని డబ్బు, బంగారం ఆశ చూపి చదువుకు దూరం చేసిందని ఆరోపించారు. కాలేజీలో చేర్పించినప్పటికీ అతడు సరిగా కాలేజీకి వెళ్లేవాడు కాదని తెలిపారు. హత్యలు చేసేందుకు శారీరకంగా బలంగా ఉండాలని చెప్పి జిమ్ సామగ్రిని కూడా ఇప్పించిందని ఆరోపించారు. ఇంట్లోనే జిమ్ చేసేవాడని చెప్పారు. భూంపల్లి డబుల్ బెడ్రూం ఇళ్లలో రజిత, ఆమె భర్త దుబ్బయ్య, మైనర్ కుమారుడు నివసిస్తున్నట్లు సమాచారం. రజిత అక్కడ కిరాణా షాప్తో పాటు టీ స్టాల్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టీ స్టాల్కు వచ్చే వ్యక్తుల్లో ఆస్తి తగాదాలు, ఇతర వివాదాలు ఉన్నవారిని.. ముఖ్యంగా ఒంటరి మహిళలను తల్లి, కొడుకు