
Car Accident: సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి వేళ గుండెలు పగిలే శోకసంద్రం అలుముకుంది. దుబ్బాక మండలం అప్పనపల్లి సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి కారు అదుపుతప్పి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, వారి ఇద్దరు అమాయక చిన్నారులు జలసమాధి అయ్యారు. ఈ భయానక ఘటన స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బలవంతపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు తన భార్య భాగ్య, ఇద్దరు చిన్నారులతో కలిసి సిద్దిపేట నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. రాత్రి వేళ ప్రయాణం కావడం, చీకటిగా ఉండటంతో అప్పనపల్లి శివారుకు చేరుకోగానే కారు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రోడ్డు పక్కనే ఉన్న ప్రమాదకరమైన వ్యవసాయ బావిలోకి కారు వేగంగా దూసుకెళ్లి క్షణాల్లో మునిగిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న దుబ్బాక పోలీసులు, అగ్నిమాపక దళ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అర్ధరాత్రి కావడం, బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలిగింది. వెంటనే జేసీబీ, క్రేన్ సహాయంతో బావిలో మునిగిపోయిన కారును బయటకు తీసేందుకు గంటల తరబడి శ్రమించారు. కారును బయటకు తీసి చూడగా అందులోని నలుగురూ శవాలై కనిపించారు. చిన్నారి పాపలతో సహా అంతా గాల్లో కలసిపోయారు ఈ దారుణ ఘటనలో కారు నడుపుతున్న దండుగుల రాజు (30), ఆయన భార్య భాగ్య (25) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ఆడుపాడుకునే వయసున్న నాలుగేళ్ల కుమారుడు నిహాన్ష్, రెండేళ్ల చిన్నారి కుమార్తె శాన్విక కూడా నీటిలో ఊపిరి ఆడక ప్రాణాలు విడిచారు. కలకాలం కలిసి ఉండాల్సిన ఒకే కుటుంబం ఇలా కంటిముందే కనుమరుగైపోవడం ఎంతటి రాతి గుండెనైనా పిండేస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఒకే ఇంట్లో