
ఇంటర్నెట్ డెస్క్: హీరో శర్వానంద్, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రానుంది. ఈ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ కొట్టగా.. ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్ చేశారు. ఇక ఈ చిత్రానికి ‘జార్జ్ క్రిష్’ (Grorge Krish) అనే టైటిల్ను ఖరారు చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న దీన్ని విడుదల చేయనున్నట్లు టీమ్ పేర్కొంది. ప్రస్తుతం శర్వానంద్ ‘భోగి’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. ఉత్తర తెలంగాణ - మహారాష్ట్ర ప్రాంతాలతో ముడిపడిన ఈ పీరియాడిక్ కథని పాన్ ఇండియా స్థాయిలో తెర పైకి తీసుకొస్తున్నారు. శర్వాకు జోడీగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటిస్తున్నారు. ‘కందుల సులోచన రాణి’గా అనుపమ కనిపించనుండగా.. మందారం అనే బోల్డ్ పాత్రలో డింపుల్ నటిస్తున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు