
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ తుది శ్వాసవిడిచారు. ఆమె గత కొంత కాలంగా శ్వాసకోశ, వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె కన్నుమూశారు. షావుకారు జానకి.. నటి కృష్ణకుమారికి సోదరి. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో 1931 డిసెంబర్ 12న జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల్లో పలు పాత్రలు పోషిస్తూ కెరీర్ ప్రారంభించారు. 11 ఏళ్లకు రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. 1949లో ‘రక్షా రేఖ’ సినిమాతో చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 1950లో ‘షావుకారు’ సినిమా హిట్ కావడంతో ఆమెకు షాపుకారు జానకిగా పేరు వచ్చింది. ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో జానకి నటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో సుమారు 400 చిత్రాల్లో, 3 హిందీ సినిమాల్లోనూ, ఒక మలయాళ చిత్రంలో నటించి మెప్పించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆమెను 2022లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ‘వద్దంటే డబ్బు’, ‘కన్యా శుల్కం’, ‘పిచ్చి పుల్లయ్య’ , ‘రేచుక్క-పగటిచుక్క, ‘రోజులు మారాయి’, ‘సొంతవూరు’, ‘జయం మనదే’, ‘డాక్టర్ చక్రవర్తి’, ‘సంసారం ఒక చదరంగం’, ‘తోడికోడళ్ళు’, ‘బాబు బంగారం’, ‘గీతాంజలి’ ఇలా అనేక హిట్ చిత్రాలలో జానకి నటించారు. చివరి సారి ‘అన్నీ మంచి శకునములే’లో ఆమె కనిపించారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత