
సామ్సంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రా 5Gకి చెందిన 12జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.90,999 ధరకు లిస్ట్ అయింది. ఈ ఫోన్ అసలు ధర రూ.1,29,900గా ఉంది. అంటే లిస్టెడ్ ధరతోనే కొనుగోలు చేసినా భారీ తగ్గింపు లభిస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వేరియంట్ టైటానియం గ్రే కలర్లో ఉంది. దీనికి అదనంగా అర్హత ఉన్న కస్టమర్లు ఎక్స్చేంజ్, బ్యాంక్ ఆఫర్లను ఉపయోగించుకోవచ్చు.
మీ దగ్గర ఉన్న అర్హత కలిగిన పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేస్తే ఫోన్ ధర మరింత తగ్గుతుంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్15 ఎక్స్చేంజ్పై గరిష్ఠంగా రూ.30,000 వరకు విలువ లభించే అవకాశం ఉంది. అయితే ఎక్స్చేంజ్ విలువ ఫోన్ మోడల్, కండిషన్, వయసు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరికీ పూర్తి రూ.30,000 ఎక్స్చేంజ్ విలువ లభిస్తుందని చెప్పలేం. మీ పాత ఫోన్ వివరాలను నమోదు చేసిన తర్వాత ఫ్లిప్‌కార్ట్ చూపించే ఎక్స్చేంజ్ విలువను పరిశీలించాలి.
ఎక్స్చేంజ్ ఆఫర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే రూ.3,050 వరకు అదనపు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. దీంతో రూ.90,999 ఉన్న ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. ధర లెక్కను పరిశీలిస్తే.. రూ.90,999 నుంచి రూ.30,000 ఎక్స్చేంజ్ ప్రయోజనం, మరో రూ.3,050 బ్యాంక్ డిస్కౌంట్ తీసివేస్తే రూ.57,949 అవుతుంది.
సామ్సంగ్ గ్యాలక్సీ ఎస్25 అల్ట్రా ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్. ఇందులో టైటానియం డిజైన్, S Pen సపోర్ట్ ఉన్నాయి. పెద్ద అమోఎల్ఈడీ డిస్ప్లే, అధిక రిఫ్రెష్ రేట్, Galaxy AI ఫీచర్లు ఈ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి.
ఫోటోగ్రఫీ కోసం హై-రిజల్యూషన్ ప్రైమరీ కెమెరాతో కూడిన మల్టీ కెమెరా సెటప్ ఉంది. అధునాతన జూమ్ సామర్థ్యాలు కూడా ఉన్నాయి. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, స్టీరియో స్పీకర్లు, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సామ్సంగ్ వన్ ఏఐ ఆధారంగా అండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.
Found this helpful?
Share this story with your network







