‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ సినిమాలకు దూరమయ్యారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. నటుడిగా పలు విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న ఆయన, ఇప్పుడు దర్శకుడిగా సరికొత్త అవతారమెత్తుతున్నారు. తన సొంత బ్యానర్ ‘కార్తికేయ క్రియేటివ్ వర్క్స్’ పతాకంపై తానే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో ఓ సరికొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బుధవారం పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను చిత్ర యూనిట్ వెల్లడించనుంది.





