గంజి నీటిలో స్టార్చ్, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులో ఉన్న పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేసి గ్యాస్, యాసిడ్ రిఫ్లక్స్ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే గంజి నీటిలో ఉండే స్టార్చ్ జీర్ణక్రియను వేగవంతం చేసి తిన్న ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థాలు, గుణాలు పేగుల కదలికలను ప్రేరేపించి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. క్రమం తప్పకుండా సరైన పరిమాణంలో తాగితే కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గంజినీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. డీహైడ్రేషన్ లేదా నీరసంతో బాధపడేవారికి ఇది ఒక ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. శరీరంలో కోల్పోయిన నీటి శాతాన్ని, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడంలో గంజి ఎంతగానో తోడ్పడుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి, కండరాల అలసటను తగ్గించడానికి ఉదయాన్నే గంజి నీళ్లు తాగడం చాలా మంచిది. జీర్ణ సంబంధిత నీరసానికి ఇది తక్షణ ఉపశమం ఇస్తుంది. అలాగే చర్మ సౌందర్యానికి కూడా ఈ గంజి నీళ్లు తోడ్పడుతాయి. గంజి నీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఎక్కువగా పెంచుతుంది. వార్చిన గంజిలో అధిక మొత్తంలో సింపుల్ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇవి త్వరగా అరిగి రక్తంలో కలిసిపోతాయి. ఇన్సులిన్ నిరోధకత లేదా షుగర్ ఉన్నవారు దీనిని తాగితే షుగర్ లెవల్స్ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. అందుకే డయాబెటిస్ ఉన్న వారు దీనికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కిడ్నీ వైఫల్యం లేదా కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి సోడియం, పొటాషియం, ద్రవాల పరిమాణం శరీరంలో సరిగా నియంత్రించబడవు. గంజి నీటిలో పొటాషియం, పిండి పదార్థాలు ఉంటాయి. వీటిని వడపోయడం దెబ్బతిన్న కిడ్నీలకు భారంగా మారుతుంది. ఇది రక్తంలో పొటాషియం స్థాయిలను పెంచి గుండె సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అలాగే కిడ్నీ