© 2026 nimisham.in

హైదరాబాద్ నగర వైద్య మౌలిక సదుపాయాల్లో మరో కీలక అధ్యాయానికి సోమవారం శ్రీకారం చుట్టనున్నారు. ఎర్రగడ్డలో అత్యాధునిక వసతులతో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా.ఎంసీఆర్ టిమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (సోమవారం) సాయంత్రం 4.30 గంటలకు లాంఛనంగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.సుమారు 22.6 ఎకరాల సువిశాల ప్రాంగణంలో రూ.1,100 కోట్ల భారీ వ్యయంతో ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. వెయ్యి పడకల సామర్థ్యంతో, ఐదు బ్లాకులతో దీనిని అత్యంత ఆధునికంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆసుపత్రిలో ట్రయల్ రన్ నిర్వహించి, డే కేర్ విభాగాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ క్రమంలో రోజుకు సుమారు 250 మంది రోగులకు వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటి ప్రధాన ఆసుపత్రుల నుంచి బదిలీపై వచ్చిన వారితో పాటు కొత్తగా నియమితులైన దాదాపు 200 మంది వైద్య సిబ్బంది ఇక్కడ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మాజీ డీఎంఈ డా.ఎ.నరేంద్రకుమార్ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా, మాజీ ఏడీఎంఈ డా.మహబూబ్ ఖాన్ ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా వ్యవహరించనున్నారు.ఆసుపత్రి ప్రారంభోత్సవం నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదివారం ఏర్పాట్లను సమీక్షించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
..