
రవాణా శాఖలో ‘సీక్రెట్ ఫండ్’ వ్యవహారంపై పెద్దఎత్తున అంతర్గత చర్చ జరుగుతోంది. కమిషనరేట్ నుంచి ఇటీవల విడుదలైన నిధులను డబ్బుల రూపంలో మార్చి తనకు పంపండి అంటూ ఓ రిటైర్డ్ జాయింట్ కమిషనర్ సంబంధిత ఆర్టీవోలకు ఫోన్ చేసి అడిగినట్లు సమాచారం. ‘ఎందుకు అడుగుతున్నానో.. మీరే అర్థం చేసుకోండి..’ అంటూ ఆ రిటైర్డ్ జేటీసీ అంటుండడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.





