రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, గ్లింప్స్, ఇతర స్పెషల్ పోస్టర్లకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 21న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ మూవీ కథేంటనేది దర్శకుడు శివ నిర్వాణ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘ఇరుముడి’ అనేది ఒక ఫ్యామిలీ అండ్ డివోషనల్ మూవీగా ప్రచారం చేయబడుతోంది. టైటిల్ గ్లింప్స్, టీజర్ లో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించడం, అయ్యప్ప గురించి సాంగ్ పెట్టడం, మల్లెపూల పల్లకి పాటను రీమిక్స్ చేయడంతో.. శబరిమల బ్యాక్‌డ్రాప్‌లో ఏఈ సినిమా రూపొందుతోందనే అందరూ భావించారు. సినిమా స్టోరీపై రకరకాల వార్తలు వస్తున్న తరుణంలో.. కథా నేపథ్యం ఏంటనేది శివ నిర్వాణ హింట్ ఇచ్చారు. శబరిమల గుడికి ఈ చిత్రానికి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.దర్శకుడు శివ నిర్వాణ, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ కలిసి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. ''బేసికల్‌గా 'ఇరుముడి' ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. కానీ కథ ముందుకు సాగే కొద్దీ నెమ్మదిగా ఊహించని స్పేస్‌లోకి వెళ్తుంది. ఒక థ్రిల్లర్ సినిమాలా అనిపిస్తుంది. చివరికి చాలా బ్యూటిఫుల్ ఎమోషన్స్‌తో ఎండ్ అవుతుంది'' అని చెప్పారు. ''తెలుగు సినిమాలో ఒక పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది. రెగ్యులర్ మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు ఇది చాలా చాలా దూరంగా ఉంటుంది. ఆడియన్స్‌కి మిస్టరీ థ్రిల్లర్ ఫీల్ ఇస్తుంది. తర్వాత ఏం జరగబోతుందో అనే క్యూరియాసిటీ కలిగిస్తుంది'' అని జీవీ ప్రకాష్ తెలిపారు. భయం, టెన్షన్, పూర్తి సీరియస్‌నెస్ అన్నీ కలిసి ఉంటాయని శివ