© 2026 nimisham.in

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది. Panchali Panchabhartruka Movie Pre Release Event: డా.రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో గంగ సప్తశిఖర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాంచాలి పంచభర్తృక’. సరీ ఫర్, రోల్ రిడా, రాజ్ పవన్, జెమినీ సురేష్, వెంకట్ దుగ్గిరెడ్డి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. రాయల్ థ్రోన్ ప్రొడక్షన్స్, ఓం సాయిరాం ఆర్ట్స్ బ్యానర్స్‌పై వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ), రాజ్ పవన్ శ్రీకాంత్ సెట్టివారి, సాయినాథ్ మణ్యం సంయుక్తంగా నిర్మించారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం.. ఈ నెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ గంగ సప్తశిఖర మాట్లాడుతూ.. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. ఒకవేళ సినిమా నచ్చకపోతే రాయల్ థ్రోన్ బ్యానర్ ఇన్ స్టా పేజికి టికెట్ పెడితే.. డబ్బులు రిటర్న్ ఇస్తామన్నారు. ఆడియన్స్ మెచ్చిన ఏ సినిమా అయినా ఫెయిల్ కాదన్నారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ నటిస్తున్నప్పుడు తనను ఇంతలా వాడుకున్న దర్శకుడు తానేని కితాబిచ్చారని గుర్తు చేసుకున్నారు. ఈ మూవీ 50కి పైగా నటీనటులు వివిధ పాత్రల్లో కనిపిస్తారని.. ఒక ఈవీవీ, జంధ్యాల, అనిల్ రావిపూడి సినిమాలా తమ సినిమాలో ఫ్రేమ్ నిండా ఆర్టిస్టులు ఉంటారని చెప్పారు. ఈ నెల 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నామని.. అమెరికాలో కూడా పెద్ద సంఖ్యలో విడుదల అవుతోందన్నారు. నటుడు థర్డీ ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ.. తన కెరీర్ రాజేంద్ర ప్రసాద్ ఆ ఒక్కటీ అడక్కు మూవీతో మొదలైందని గుర్తు చేసుకున్నారు
. ఆయన సపోర్ట్ చేయకపోతే తనకు ఈ థర్టీ ఇయర్స్ కెరీర్ లేదన్నారు. ఈ సినిమాలో తాము కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. డైరెక్టర్ గంగ సప్తశిఖర టాలెంటెడ్ అని.. నవ్వుతూనే తమ దగ్గర నుంచి కావాల్సిన పర్ఫార్మెన్స్ పిండుకున్నాడని అన్నారు. ఈ సినిమా సక్సెస్ కావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ మహేశ్ నారాయణ మాట్లాడుతూ.. ఈ సినిమాకు సంగీతం అందించేందుకు డైరెక్టర్ గంగ సప్తశిఖర చాలా ఫ్రీడమ్ ఇచ్చారని.. తక్కువ సమయంలోనే అన్ని సాంగ్స్ కంపోజ్ చేశామన్నారు. ప్రయోగాత్మకంగా కంపోజ్ చేసిన ఒక కవ్వాలీ సాంగ్‌ను రాజేంద్ర ప్రసాద్ విని సినిమాలో పెట్టమని సూచించారని చెప్పారు. ఈ సినిమాకు తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. నటుడు శ్రీనివాస్ మాట్లాడుతూ.. డైరెక్టర్ గంగ సప్తశిఖరకు మంచి కామెడీ టైమింగ్ ఉందని.. ఆయన సీన్స్ చెబుతున్నప్పుడే చాలా నవ్వుకున్నామన్నారు. తన క్యారెక్టర్‌ను ఆకట్టుకునేలా రూపొందించారని చెప్పారుఉ. ఈ నెల 14న థియేటర్స్ లో ‘పాంచాలి పంచభర్తృక’ సినిమా తప్పకుండా చూడాలని కోరారు.