© 2026 nimisham.in
తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. మరో వీకెండ్ రైలు అందుబాటులోకి వచ్చింది. తిరుపతి టు విశాఖపట్నం వీకెడ్ స్పెషల్ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 10 వరకు తిరుపతి నుంచి విశాఖపట్నం వీకెండ్ ప్రత్యేక రైలు (08509) అందుబాటులోకి రానుంది. ఈ రైలు ప్రతి ఆదివారం, గురువారం తిరుపతిలో ఉదయం 9.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ విశాఖపట్నం-తిరుపతి ప్రత్యేక రైలు (08510) తిరుగు ప్రయాణంలో ఆగస్టు 17 నుంచి సెప్టెంబరు 11 వరకు ప్రతి సోమవారం, శుక్రవారం విశాఖపట్నంలో రాత్రి 7.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6.45 గంటలకు తిరుపతి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ స్పెషల్ రైలుకు 22 ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌ల ఉంటాయన్నారు.మరోవైపు రైల్వే అధికారులు ప్రయాణికుల రద్దీ, వెయిటింగ్ లిస్ట్ పెరగడంతో రద్దీని తగ్గించేందుకు సంబల్పూర్-చర్లపల్లి (08309) వన్‌వే ప్రత్యేక రైలును నడపాలని నిర్ణయించారు. ఈ రైలు సంబల్పూర్లో ఆగస్టు 14న ఉదయం 11.45 గంటలకు బయలుదేరి.. ఈ నెల 15వ తేదీ ఉదయం 11.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలుకు 20 బోగీలు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.తమిళనాడుకు ప్రత్యేక రైళ్లుమరోవైపు దక్షిణ మధ్య రైల్వే తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో జరగనున్న వేలంకన్ని ఉత్సవాలకు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చి వార్షిక ఉత్సవాలు ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశాలుండటంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.. ఇవి తెలంగాణలోని బీబీనగర్, నల్లగొండ, మిర్యాలగూడ.. ఏపీలోని నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట
, తిరుపతి, చిత్తూరు.. అలాగే తమిళనాడులోని కాట్పాడి, తిరువణ్ణామలై, విల్లుపురం, మైలాడుతురై, నాగప్పట్టినం స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాల కోసం మహారాష్ట్ర నుంచి ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 7 వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ రైళ్లు థానే, కళ్యాణ్, లోనావాలా, పూణే, దౌండ్, షోలాపూర్, కలబురగి, వాడి, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, తిరువణ్ణై, కత్పాడిలాపురం స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.