
జె.పంగులూరు: గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని అద్దంకి తహసీల్దార్ సింగారావు, రూరల్ సీఐ మల్లికార్జునరావు అన్నారు. మండలంలోని ముప్పవరం గ్రామంలో కాటూరి మెడికల్ కళాశాల హాస్పిటల్ వారి సౌజన్యంతో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని తహసీల్దార్ సింగారావు, అద్దంకి రూరల్ సీఐ మల్లికార్జునరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం అత్యాధునిక వైద్య సౌకర్యాలు కలిగిన మొబైల్ వాహనంలో పలువురికి వైద్యపరీక్షలు నిర్వహించారు. 320 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి పలువురికి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. తదుపరి వైద్య పరీక్షలు అవసరమైన రోగులకు వైద్యశాలకు తీసుకువెళ్లేందుకు సోమవారం ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు కాటూరి వైద్యశాల మార్కెటింగ్ మేనేజర్ రాంబాబు రామకృష్ణ తెలిపారు. ఈ శిబిరంలో మండల తెదేపా అధ్యక్షుడు రావు రమేశ్, మాజీ అధ్యక్షుడు చింతల సహదేవుడు, గుర్రం ఆదిశేఖర్, అద్దంకి ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుబ్బారావు, దాసరి హనుమంతరావు మస్తాన్వలీ, జక్రయ రావుల, సింగరకొండ గడ్డం నాగేశ్వరావు, సింగర్ నార్ని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు