
ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల కల సాకారం కాబోతోంది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించే కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పాయకరావుపేటలో గోదావరికి అఖండ హారతి ఇచ్చి.. నీటిని విడుదల చేయనున్నారు. కొండలు, కోనలు, వాగులు, వంకలు, రహదారులు, రైల్వే ట్రాక్లను దాటి నీటిని మళ్లించడంలో ప్రభుత్వ ప్రణాళికలు.. వాటి అమలులో వ్యయప్రయాసలు, ఇంజినీరింగ్ అద్భుతాలు, కార్మికుల కష్టాలను తరచి చూడాల్సిన తరుణమిది. ఇక్కడి ప్రజల దాహార్తి తీర్చి, పొలాలను తడిపి, పారిశ్రామిక అవసరాలు తీర్చే ఎడమ కాలువ ఎలా ఉందో వీడియోలో చూసేయండి. ఈ వార్త చదివారా: పోలవరం నీళ్లు.. ఉత్తరాంధ్రలో పరవళ్లు





