
డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పిఠాపురంలో… అలా మొదలైంది’. ఈ సినిమాని మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదారి కిట్టయ్య) నిర్మించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్‌తో నాకు 25 ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. ఆయన క్లారిటీతో ఉండే అద్భుతమైన దర్శకుడు. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మంచి విజయం సాధించాలి. కొత్త కంటెంట్‌తో, ఫ్రెష్ సబ్జెక్ట్‌తో ఆయన తీసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను.’ అని అన్నారు. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ .. ‘చంద్ర మహేష్ యోగ్యుడైన దర్శకుడు. ఆయన మంచి వ్యక్తి. ఈ చిత్రంతో చంద్ర మహేష్‌కి మంచి విజయం దక్కాలి. చంద్ర మహేష్ నిర్మాతల డైరెక్టర్. ఇలాంటి ఉత్తమ దర్శకుడు మరిన్ని సినిమాల్ని తెరకెక్కించాలని కోరుకుంటున్నాను. చైతన్య రెడ్డి గారు ఈ మూవీని రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాతో అందరికీ మంచి పేరు రావాలి. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ‘‘చంద్ర మహేష్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీని నిర్మించిన దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాతలకు మంచి లాభాలు దక్కాలి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తీసిన ఈ చిత్రం మంచి విజయం దక్కాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.






